నారా రోహిత్‌కు హిట్ క‌ళ‌… ‘ గోవింద‌చ‌రితం ‘ టీజ‌ర్ టాక్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

నారా రోహిత్ రెండేళ్ల క్రితం వ‌ర‌కు వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోయాడు. ప్ర‌తి సినిమాకు రోహిత్ ఎంతో వైవిధ్య‌మైన క‌థ‌లు ఎంచుకున్నా హిట్ మాత్రం వ‌చ్చేది కాదు. రోహిత్ సినిమాలు క‌థాప‌రంగా వైవిధ్యంగా మిగిలిపోయేవే కాని క‌మ‌ర్షియ‌ల్ హిట్ వ‌చ్చేది కాదు. రెండేళ్ల‌లో ఏకంగా 12 సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రోహిత్ కాస్త గ్యాప్ తీసుకుని గోవింద‌చ‌రితం లాంటి క్యూట్ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ తీశాడు.

వేగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్ రోహిత్ బర్త్ డే కానుక‌గా రిలీజ్ చేశారు. మొత్తం 40 సెక‌న్ల పాటు ఉన్న టీజ‌ర్లో కేవ‌లం హీరో – హీరోయిన్లు మాత్ర‌మే ఉన్నారు. హీరోయిన్ వీణ వాయించ‌డం, రోహిత్ – హీరోయిన్ హ‌గ్ చేసుకోవ‌డం, కిస్ చేసుకోవ‌డం ఇలా టీజ‌ర్ మొత్తం రొమాంటిక్ షాట్స్‌తోనే నింపేశారు.

టీజ‌ర్ చూస్తుంటే రోహిత్ నుంచి గ‌త సినిమాల‌కు భిన్నంగా అంద‌మైన ల‌వ్ స్టోరీ రాబోతుంద‌న్న భావ‌న క‌లుగుతోంది. ఏదేమైనా ఈ సినిమాతో అయినా రోహిత్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుని మార్కెట్ స్టాండ‌ర్డ్ చేసుకుంటాడేమో ? చూడాలి.

Share.