బిగ్ బాస్ 3: ఫస్ట్ ఎలిమినేటర్ ఎవరంటే…

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగులో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఐదు ఎపిసోడ్లు కంప్లీట్ అవ్వగా హౌజ్ లో జరుగుతున్న వివాదాలతో ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి క్రియేట్ అయింది. ఈ షోలో ఉన్న కంటెస్టెంట్లలో ఎక్కువమంది సినిమాలు, సీరియల్స్, యూట్యూబ్ ద్వారా పరిచయం ఉన్న సెలబ్రిటీలే కావడంతో స్పందన కూడా బాగుంది. ఇక తొలివారం హౌజ్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది. మొత్తం ఆరుగురు సెలబ్రిటీలు ఎలిమినేషన్ లిస్టులో ఉన్నారు.

వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు, జర్నలిస్ట్ జాఫర్, నటి హిమజ, నటి పునర్నవి భూపాళం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నటి హేమ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. ఇక హౌజ్ నుంచి తొలి ఎలిమినేటర్ ఎవరు ? అన్నదానిపై ఎవరి లెక్కలు వేసుకుంటున్నారు. ప్రముఖ క్రిటిక్ కత్తి మహేష్ తన సోషల్ మీడియాలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. బిగ్ బాస్-1లో నోరు జారిన జ్యోతి… 2లో నోరు జారిన సంజన ఎలిమినేట్ అయ్యారని… ఇప్పుడు త్రీ లో రాహుల్ సిప్లిగంజ్ అలాగే చేయడంతో అతడు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని
కత్తి మహేష్ పోస్ట్ చేయటం విశేషం.

Share.