సాహో మరో పోస్టర్ రిలీజ్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆగస్టు 30 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన అభిమానుల సంతోషం కోసం మరో కొత్త పోస్టర్ను విడుదల చేసారు.. సాహో సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్ది సినిమా ప్రమోషన్స్ పై దృష్టి సారించింది చిత్ర యూనిట్. అందులో భాగంగా అభిమానుల కోసం మరో పోస్టర్ను విడుదల చేసి ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారనే చెప్పొచ్చు.

ఇక సాహో సినిమా ప్రమోషన్ లో భాగంగా రోజుకో కొత్త రకం పోస్టర్ తో అభిమానుల మనస్సు దోచుకునే ప్రయత్నం చేస్తోంది సాహో టీం. ఇటీవలే సాహో హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధ పై ఓ రోమాంటిక్ పోస్టర్ను విడుదల చేసిన చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితమే ఓ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధ కపూర్ తో పాటు విలన్ గ్యాంగ్ కూడా గన్లతో ఫేస్ టూ ఫేస్ తలపడే సన్నివేశం ఉన్న ఫోస్టర్ను విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు.

సాహో సినిమా అంటే యాక్షన్ కు పెట్టింది పేరనే విధంగా ఈ పోస్టర్ను రూపొందించారు. ఈ పోస్టర్ విడుదలతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపినట్లైంది. సాహో సినిమాను దర్శకుడు సుజిత్ హాలీవుడ్ తరహాలో తెరకెక్కించారు.

Share.