దొరసాని రివ్యూ & రేటింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

నటీనటులు : ఆనంద్ దేవరకొండ, శివాత్మిక

దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర

నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని

సంగీతం : ప్రశాంత్ ఆర్ వర్మ

సినిమాటోగ్రఫర్ : సన్నీ కూరపాటి

ఎడిటర్ : నవీన్ నూలి

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ , హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక జంటగా నటించిన సినిమా దొరసాని. దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర దర్శకత్వంలో, మధురా ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినమాలు సంయుక్తంగా నిర్మించింది. ‘దొరసాని’ సినిమా ఈ రోజే విడుదల అయింది. ఈ చిత్రం ప్రేక్షకులును ఏ మేరకు రంజింప చేస్తుందో ఓమారు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

అంటరాని కులానికి చెందిన పేద కుటుంబంలో పుడతాడు రాజు (ఆనంద్ దేవరకొండ). ఊరులోని దొర కూతురు ‘చిన్న దొరసాని’ దేవకి(శివాత్మిక)ని అనుకోకుండా చూసిన రాజు ప్రేమలో పడతాడు. దేవకి రూపాన్ని తలుచుకుంటూ నిత్యం ఆమే నివసించే గది కిటికి వంక చూస్తూ ఆమేను గాఢంగా ప్రేమిస్తుంటాడు రాజు. చిన్న దొరసాని దేవకి సైతం రాజు ను క్రమంగా ప్రేమించడం మొదలు పెడుతుంది. అదే విధంగా రాజు అల్లే కవితలను ఇష్ట పడుతుంది దొరసాని. ఇలా ఇద్దరు గాడంగా ప్రేమించుకుంటారు. అనుకోకుండా నక్స్ లైట్లు వీళ్ళ ప్రేమకు సహాకరిస్తారు.
అన్నలు ఎందుకు ఉపయోగపడ్డారు. దొరసాని, రాజుల ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది… ఇద్దరు తరువాత ఒక్కటయ్యారా.. లేక ఏమైంది అనేది తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా రజాకార్లు ఏలిన కాలంలో దొరలు, అంటరాని కులాల నడుమ ఎలాంటి కట్టుబాట్లు ఉండేవి, ఈ కట్టుబాట్లను ఈ సినిమాలో దర్శకుడు చాలా స్పష్టంగా చూపారు. దొరల వ్యవస్థలో ఉన్న కట్టుబాట్లతో స్వచ్ఛమైన ప్రేమ కోసం ప్రేమికులు పడే సంఘర్షణ ఎలాగుంది అనే పాయింట్ ను ఎలివేట్ చేశారు. దొరసాని సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు, ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా నేపధ్యం, లొకేషన్లు, నటీనటుల నుండి రాబట్టుకున్న సహజసిద్ధమైన నటన వంటి అంశాలు సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ఇద్దరూ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు. ఆనంద్ దేవరకొండ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. విజయ్ దేవరకొండను మరిపించేలా సినిమాలో నటించాడు. ఇక శివాత్మిక తన సహజసిద్ధమైన నటనతో రక్తికట్టించిందనే చెప్పాలి. శివాత్మిక తండ్రి నటన, కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సీన్ల సాగదీత, దొరతనం చాలా ఓవర్గా చూపడం కొంతమేరకు ఇబ్బంది కలిగించింది. ఇక ప్రేమ కాన్సెప్ట్ అనేది పాతదే కావడం. అదే విధంగా పేదింటి కుర్రాడు, ధనికుల అమ్మాయిల ప్రేమ అనేది పాత కథే. ప్రేమ సన్నివేశాలు ఎక్కువగా కాకుండా, గ్రామాల్లో ఉన్న అంటరాని తనంపై మరింత చూపించాల్సి ఉండేది. ఇంతకు మించి మైనస్లు ఏమీ లేవని చెప్పొచ్చు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర పనితీరు చాలా బాగుంది. సినిమాను అనుకున్నట్లుగానే తీసి ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగా చిత్రాన్ని మలిచాడు. నటులతో సాధ్యమైనంత మేరకు వాటి నటన ప్రభిభకు పని కల్పించాడు. ఇక సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి అందించిన సంగీతం చాలా బాగుంది. . సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగట్లు ఆకట్టుకుంటుంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా అప్పటి కాలాన్ని గుర్తు చేస్తూ నడుస్తాయి. నిర్మాతలు ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు అభినందించి తీరాలి. నిర్మాతల ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

తీర్పు :

దర్శకుడు కే.వీ.ఆర్ మహేంద్ర ఓ సామాజిక ఆంశంను తెరకెక్కించడం చాలా అభినందించతగిన విషయం. నాటి కాలంలో కుల కట్టుబాట్లు, దొరలు, అంటరాని కులాలతో ఉండే తీరు, అంటరాని కులాలు పడుతున్న యాతనను కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించాడు. కుల కట్టుబాట్ల ఆంశాన్ని తీసుకుని చిత్రాన్ని కమర్షియల్గా మలిచిన తీరు అత్యద్భుతం. సినిమాను ప్రారంభం నుంచి శుభం కార్డు వరకు ప్రేక్షకులకు ఎక్కడ ఇబ్బందిగా ఫీల్ కాకుండా మలిచాడు. అందులో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక కొత్తగా టాలీవుడ్ కు పరిచయం అయిన నాయికా నాయకలు నటించిన తీరు బాగా ఉంది. మొత్తానికి ఈ సినిమా బాగుందని చెప్పొచ్చు.

సమీక్ష : దొరసాని దొరసానే….

రేటింగ్ : 3.25/5

Share.