మహేష్ ‘మహర్షి’ రివ్యూ & రేటింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. మహేష్ మహర్షి ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

రిషి(మహేష్) క్లవర్ స్టూడెంట్.. సక్సెస్ డెస్టినేషన్ కాకూడదు అని మన జర్నీలో భాగమవ్వాలని అనుకునే రిషి తన స్నేహితుడు రవి(అల్లరి నరేష్) , పూజాలతో సరదాగా గడుపుతాడు. అయితే కాలేజ్ లో ఓ ఇన్సిడెంట్ వల్ల కాలేజ్ నుండి బయటకు వెళ్లాక ఎవరికి టచ్ లో ఉండడు. మళ్లీ తండ్రి మరణ వార్త విని తిరిగి ఇండియా వచ్చిన రిషి ఏం చేశాడు. రవి కోసం రిషి ఏం చేశాడు. రైతుల కష్టాల గురించి రిషి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

రిషి పాత్రలో మహేష్ అదరగొట్టాడు. మూడు వేరియేషన్స్ ఉన్న రిషి పాత్రలో మహేష్ మరోసారి తన ప్రతిభ చాటాడు. ఇక రవి పాత్రలో అల్లరి నరేష్ కూడా చాలా బాగా చేశాడు. సినిమాలో అతని రోల్ సర్ ప్రైజ్ చేస్తుంది. పూజా హెగ్దె బబ్లీ గాల్ గా బాగానే నటించింది. పూజా గ్లామర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. ప్రకాశ్ రాజ్, జయసుధ, రావు రమేష్, తనికెళ్ల భరణి ఇలా అందరు బాగా చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :

మోహనన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, సినిమాకు కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. లొకేషన్స్, షాట్స్ అన్ని బాగా కవర్ చేశారు. ఇక దేవి శ్రీ మ్యూజిక్ కూడా ఇంప్రెస్ చేసింది. సాంగ్స్ ఒకటి రెండే బాగున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. ఇక కథ, కథనాల్లో వంశీ పైడీల్లి మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు. మహేష్ లాంటి హీరోకి ఎలాంటి కథ అయితే ఆడియెన్స్ కనెక్ట్ అవుతారో అలాంటి కథతోనే సినిమా తీశారు. ముగ్గురు బడా నిర్మాతల ప్రొడక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవలేదని సినిమా చూస్తే తెలుస్తుంది.

విశ్లేషణ :

మహేష్ మహర్షి అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగగా.. సెకండ్ హాఫ్ మెయిన్ కంటెంట్ మీద గురి పెడతాడు. అయితే సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వరకు కాస్త స్లో అనిపిస్తుంది. కాని క్లైమాక్స్ మాత్రం అందరిని అలరిస్తుంది. స్ట్రాంగ్ కంటెంట్ పవర్ ఉన్న సినిమాలకు కమర్షియల్ హగులని అద్ది వంశీ పైడీపల్లి చక్కగా ఈ సినిమా తీశారు.

మహేష్ ఫ్యాన్స్ కోరుకునే కమర్షీయ్ల్ అంశాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా చాలా నీట్ గా తీశారు. సినిమా మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో ఎక్కువ దృష్టి పెట్టారు. మే నెల మహేష్ కు బ్యాడ్ సెంటిమెంట్ అనుకుంటుండగా మహర్షి ఆ సెంటిమెంట్ కొట్టిపారేసేలా ఉంది. కచ్చితంగా సగటు సిని ప్రేక్షకుడు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తాడు.

ప్లస్ పాయింట్స్ :

మహేష్

అల్లరి నరేష్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ స్లో అవడం

బాటం లైన్ :

మహర్షి.. పర్ఫెక్ట్ ల్యాండ్ మార్క్ మూవీ ఫర్ మహేష్..!

రేటింగ్ : 3.5/5

Share.