అఖిల్ మిస్టర్ మజ్ను రివ్యూ & రేటింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా మిస్టర్ మజ్ ను. బోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

తన తోడు కోసం వెతుకుతున్న నిక్కి (అధి అగర్వాల్)కు విక్కి (అఖిల్) పరిచయం అవుతాడు. ఇద్దరు కలిసి ఇండియా వస్తారు. కొన్ని కారణాల వల్ల ఆమె నుండి దూరమవుతాడు విక్కి. అయితే తన తప్పు తెలుసుకుని ఆమె కోసం మళ్లీ తను చదువుకునే దగ్గరకు వెళ్తాడు విక్కి. ఇంతకీ విక్కి, నిక్కిలు ఎందుకు విడిపోయారు. ఎలా కలిశారు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

అఖిల్ మునుపటి సినిమాల కన్నా ఈ సినిమాలో నటన పరంగా ఇంకాస్త మెరుగ్గా చేశాడని చెప్పొచ్చు. నిధి అగర్వాల్ తన వరకు తాను బాగా చేసింది. సినిమాలో ఆమె చాలా అందంగా కనిపించింది. ఇక ప్రియదర్శి, హైపర్ ఆది కామెడీ అక్కడక్కడ నవ్వులు తెప్పించింది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

జార్జ్ సి విలియంస్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా ఎక్కువ శాతం యూరప్ లో తీశారు. అక్కడ లొకేషన్స్ అందంగా చూపించారు. తమన్ మ్యూజిక్ మరోసారి మ్యాజిక్ చేసింది. కథ, కథనాల్లో దర్శకుడు వెంకీ అట్లూరి మరోసారి తన ప్రతిభ చాటాడని చెప్పొచ్చు. సినిమా అంతా కూల్ గా సాగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

తొలిప్రేమ సినిమాతో తొలి సినిమా హిట్ అందుకున్న వెంకీ అట్లూరి రెండో సినిమా కూడా అదే తరహా కథతో వచ్చాడు. అఖిల్ లవర్ బోయ్ గా ప్యూర్ లవ్ స్టోరీగా వచ్చింది మిస్టర్ మజ్ ను. కథ కొత్తగా ఏం లేదు కాని దర్శకుడు రాసుకున్న కథనం అలరించింది. సినిమా అంతగా ఎమోషనల్ గా సాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

అఖిల్, నిధిల పెయిర్ బాగుంది. వారి మధ్య సీన్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వారి సీన్స్ లో డైలాగ్స్, మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. సినిమాలో అఖిల్ జోష్ ఫుల్ గా కనిపించాడు. ప్లే బోయ్ పాత్రలో అఖిల్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. వెంకీ అట్లూరి ఈ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించాడని చెప్పొచ్చు.

ఎక్కడ బోర్ కొట్టకుండా చేశాడు. సినిమా యూత్ ఎంటర్టైనర్ గా అలరించడం ఖాయమని చెప్పొచ్చు. అక్కినేని హీరోకి తొలి హిట్ వచ్చేసినట్టే.

ప్లస్ పాయింట్స్ :

లవ్ సీన్స్

ఎమోషన్

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

పెద్దగా ట్విస్టులు ఏం లేవు

బాటం లైన్ :
అఖిల్ మిస్టర్ మజ్ను మెప్పించేశాడు..!

రేటింగ్ : 3/5

Share.