చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి

Google+ Pinterest LinkedIn Tumblr +

మనం రోజూ తినే ఆరోగ్యం మన శరీరానికి శక్తిని చేకూరుస్తుంది. ఆహారంలో అనేక పోషక పదార్ధాలు ఉండేలా చూస్తేనే మనం బలంగా ఉంటాం. అలాగే మన పళ్ళను బలంగా ఉంచుకునేందుకు కేవలం బ్రష్ చేస్తే సరిపోదు. అప్పుడప్పుడు డెంటిస్ట్‌ దగ్గరకు వెళ్ళాల్సిందే. అయితే కేవలం పళ్ళను శుభ్రంగా ఉంచుకుంటే సరిపోదు.. చిగుళ్లను కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేదంటే అనేక ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

మనం తినే ఆహారం పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి ఉంటుంది. దీనిని రోజుకు రెండు సార్లు బ్రష్ చేసి శుభ్రపరుచుకోవాలి. లేకపోతే నోట్లో ఉండే బ్యాక్టీరియా వీటి వల్ల పళ్ళకు హాని కలిగిస్తాయి. తద్వారా చిగుళ్ల నొప్పి ఏర్పడుతుంది. వీటిని నివారించేందుకు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలు, పెరుగు, చీజ్, సోయా, రాగులు తీసుకుంటే మన దంతాలు బలంగా ఉంటాయి. రోజూ పళ్లు తోముకున్న తరువాత చెంచాడు నువ్వుల నూనె‌తో చిగుళ్లపై మర్దనా చేయాలి. చెంచాడు నువ్వుల నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలి తింటుంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

రాత్రి పడుకునే ముందు కూడా గోరువెచ్చని నీళ్లలో కాస్త ఉప్పు వేసి ఆ నీటిని పుక్కిలించి ఉమ్మేస్తే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. పళ్లకు హానిచేసే బిస్కెట్లు, చాక్లెట్లు, తీపిపదార్థాలు, మైదా వంటివి తగ్గించుకుంటే పళ్లకు ఎలాంటి నష్టం జరగదు. అలాగే ఆహారం తిన్న ప్రతిసారీ నోట్లో నీళ్లు పోసుకొని బాగా పుక్కిలించి ఉమ్మేయడం మంచిదని డెంటిస్టులు సూచిస్తారు.

 

Share.