ఫ్యాన్స్ కి బన్నీ షాకింగ్ న్యూస్

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా ‘ నా పేరు సూర్య’ బన్నీ కెరీర్ లోనే అత్యంత బారి డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా పై అంచనాలు బాగా ఉన్నప్పటికీ కథ, కథనం అభిమానులని ఆశించిన స్థాయిలో లేకపోవటం తో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. బయ్యర్లు కూడా ఈ సినిమాతో బాగానే నష్ట పోయారని ఇండస్ట్రీ లో టాక్. అయితే అటు తర్వాత అల్లు అర్జున్ ఎటువంటి సినిమా చేయబోతున్నారనే దాని పై ఇండస్ట్రీ లోనే కాకుండా బన్నీ ఫ్యాన్స్ లో కూడా ఉత్కంఠ నెలకొంది. దీని పై పలు వెబ్ సైట్స్ ఎవరికీ తోచిన విధంగా వారు అనేక తప్పుడు వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు.

అయితే వీటన్నిటికీ నిన్న రాత్రి తన అఫిషియల్ ట్విట్టర్ ద్వారా బన్నీ సమాధానం చెప్పారు, అదేంటంటే

“ఫ్యాన్స్ అందరికి నా ధన్యవాదాలు మీరు చూపిస్తున్న ఈ ప్రేమకి నా కృతజ్ఞతలు, దయచేసి ఓపిక పట్టండి మరి కొద్దీ రోజుల్లో నేనే స్వయంగా నా నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేస్తాను…మీ అందరికి ఒక మంచి మూవీ ఇవ్వాలనేదే నా కోరిక దీనికి కొంత సమయం పెట్టె అవకాశం ఉంది…ఇన్ని రోజులు అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు” అని ముగించారు.

Share.