శిరోజాలు ఆరోగ్యాంగా ఉండాలంటే ఇలా చేయండి

Google+ Pinterest LinkedIn Tumblr +

నేటి యువత శిరోజాల పై చూపుతున్న శ్రద్ధ అంత ఇంత కాదు. సాధారణంగా మనం తినే ఆహారంలో తగినంత పోషకాలు లేకపోతే ఆ ప్రభావం మన వెంట్రుకల పై పడుతుంది. మనం తీసుకునే ఆహారంలో మొదటగా పోషకాలు అన్ని శరీరంలోని ముఖ్య బాగాలకి చేరుతాయి, మిగిలిన పోషకాలు వెంట్రుకలకి మరియు మన గోళ్లకి అందుతాయి. ఒకవేళ వెంట్రుకలకి ఆహారం ద్వారా సరిపడ పోషకాలు అందకపోతే మెల్లిగా వెంట్రుకలు రాలిపోవటం జరుగుతూ ఉంటుంది.
కాబట్టి మనం తినే ఆహారంలో అన్ని విటమిన్స్, మినరల్స్ ఉండే లాగా చూసుకోవటం మన బాధ్యత. కావున మనం తినే ఆహారంలో పోషకాలతో పాటు ప్రధానంగా ఇ, డి, సి, బి విటమిన్స్ ఉండే లాగా చూసుకోవాలి. దీని కోసం తాజా ఆకుకూరలు, పళ్లు తీసుకోవటం చాల అవసరం. అంతే కాకుండా వెంట్రుకలని ఎప్పటికప్పుడు శుభ్రంగా కూడా ఉంచుకోవటం ముఖ్యం.

Share.