ఆ సినిమాలకు కలిసి రాని బిగ్ బాస్ షో

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ సక్సెస్ అయ్యింది. రియాలిటీ షోలో తెలుగు వారికి ఏమాత్రం పరిచయం లేకున్నా తారక్ హోస్టింగ్ తో బిగ్ బాస్ అదరగొట్టింది. మొదటి సీజన్ షో హిట్ అవడమే కాదు ఆ షోలో ప్రమోషన్స్ కు వచ్చిన సినిమాలు హిట్ అయ్యాయి. బిగ్ బాస్ హౌజ్ లోకి సినిమా ప్రమోషన్స్ వెళ్లగా సీజన్ 1 లో దాదాపు అన్ని సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి.

కాని ఈసారి అలా లేదు బిగ్ బాస్-2లో ప్రమోషన్స్ కు అడుగు పెట్టిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ వస్తుంది. ఈ సీజన్ లో జంబలకిడి పంబ, తేజ్ ఐలవ్యూ, వైఫ్ ఆఫ్ రామ్ సినిమాలు ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చారు. కాని వచ్చిన 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

మొదటి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లోకి అర్జున్ రెడ్డి, నేనే రాజు నేనే మంత్రి, ఆనందో బ్రహ్మ, జై లవ కుశ ప్రమోషన్స్ జరిగాయి. వాటి ఫలితాలు కూడా అందరికి తెలిసిందే. సో ఈసారి బిగ్ బాస్ సినిమా వాళ్లకు బాగా దెబ్బేసేలా ఉందని అనిపిస్తుంది.

Share.