అలాంటివారిని చెప్పుతో కొట్టాలనిపిస్తుంది: మంచు లక్ష్మి

Google+ Pinterest LinkedIn Tumblr +

మంచు లక్ష్మి తెలుగులో తాజాగా నటించిన చిత్రం ‘ వైఫ్ అఫ్ రామ్’, ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా లక్ష్మి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంచు లక్ష్మి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ తన పై సోషల్ మీడియా కొంత మంది వ్యక్తులు అదే పనిగా ట్రోలింగ్ చేస్తున్నారని తన కుటుంబ సభ్యుల పైన కూడా లేని పోనీ అసభ్యకరమైన కామెంట్స్ మరియు నెట్ లో మా ఫోటోలని మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని వెల్లడించింది లక్ష్మి మంచు. ఇలాంటివి కొంత వరకు నవ్వు తెప్పిస్తాయని కానీ శృతి మించితే మాత్రం తనకి ఎక్కడ లేని కోపం వస్తుందని తెలిపింది.

మా వ్యక్తిగత జీవితాలని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆమె మీడియా కి చెప్పారు. అసలు ఇలా మార్ఫింగ్ చేసే వారిని చెప్పుతో కొట్టాలనిపిస్తుందని మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. ఇలా చీప్ గా ప్రవర్తించే వారి ని ఒకోసారి చంపాలని కూడా ఉంటుందని చెప్పారు. ఈ విధంగా ఇతిరుల జీవితాల్లోకి తొంగి చూడకూడదని అన్నిటికి ఒక హద్దు ఉంటదని ఆమె ఆవేదన చెందారు.

Share.